1 August, 2026 | 1:05 AM

జీపీడీపీ పటిష్ట ప్రణాళికలను రూపొందించాలి

01-08-2026 12:00 AM

హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ, జూలై 31 (విజయక్రాంతి): 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రామ, మండల, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు సమగ్రంగా పటిష్ట ప్రణాళికలను రూపొందించి నిర్ణీత గడువులోగా సమర్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రణాళికల రూపకల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సర్వ శిక్షా అభియాన్, వ్యవసాయ, సంక్షేమ, వైద్యారోగ్య, విద్యుత్, గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఓ), మత్స్య, అటవీ, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, విద్య, రెవెన్యూ తదితర శాఖలు తమ 202627 కార్యాచరణ ప్రణాళికలు, అమలులో ఉన్న పథకాలు, ప్రతిపాదిత పనులు, అందుబాటులో ఉన్న వనరులు, లబ్ధిదారుల వివరాలు, నిధుల వినియోగం తదితర సమాచారాన్ని సమగ్రంగా సిద్ధం చేసి జీపీడీపీ ప్రణాళికల్లో పొందుపరచాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

అన్ని శాఖల జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు గ్రామసభలు, మండల స్థాయి సమావేశాల్లో తప్పనిసరిగా పాల్గొని ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని, శాఖల మధ్య సమన్వయంతో గ్రామాభివృద్ధికి ఉపయోగపడే కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్వో శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.