14 April, 2026 | 4:16 AM

రోహిత్‌శర్మకు స్కానింగ్

14-04-2026 01:48 AM

పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరం

ముంబై, ఏప్రిల్ 13 : హోంగ్రౌండ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయి బాధలో ఉన్న ముం బై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. రోహిత్ శర్మకు తొడ కండరాల దగ్గర  గాయమైంది. ఇన్నింగ్స్ ప్రారంభంలో 13 బం తుల్లో 19 రన్స్ చేసిన హిట్ మ్యాన్, క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడ్డాడు. గాయం తీవ్రత పెరగడంతో, ఫిజియోతో చర్చించిన తర్వాత మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

రోహిత్ గాయం ఎంత తీవ్రంగా ఉందో ప్రస్తు తానికి ఖచ్చితంగా చెప్పలేమమనీ ముంబై  ప్లేయర్ రూథర్‌ఫర్డ్ చప్పాడు.ఇది అభిమానుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం రో హిత్‌కు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. స్కానింగ్ పరీక్షలు జరుగుతాయని, ఆ ఫలితాల ఆధారంగానే తదుపరి మ్యాచ్లలో ఆడేదానిపై క్లారిటీ వస్తుందని తెలిపాయి.