14 April, 2026 | 4:00 AM

టిమ్ డేవిడ్‌కు జరిమానా

14-04-2026 01:51 AM

అంపైర్లతో అనుచిత ప్రవర్తన

ముంబై, ఏప్రిల్ 13 : ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అంపైర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాకిచ్చింది. అంపైర్లకు బంతిని అందించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా జరిమానా విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.4 ప్రకారం టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా తో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ సిక్సర్ కొట్టాడు.

అయితే డేవిడ్ బలంగా బా దడంతో బంతి ఆకారం మారిపోయింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బం తులున్న బాక్స్‌ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఒక బంతిని తీసుకొని చెక్ చేయడం ప్రారంభించాడు.  అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాలని పదే పదే అడిగినప్పటికీ టిమ్ డేవిడ్ అతడిని పట్టించుకోకుండా అదే పనిగా బంతిని గాల్లోకి విసురు తూ దానిని చెక్ చేస్తూనే ఉన్నాడు.

లెగ్ అం పైర్ వీరేందర్ శర్మ వచ్చి ఇలా చేయడం తగదని వార్నింగ్ ఇవ్వడం, ఇంతలో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్‌కు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ అనంతరం అంపైర్ల ఫిర్యాదుతో ఈ ఆసీస్ ప్లేయర్‌పై గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కూడా షాక్ తగిలింది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు రూ.12 లక్షల జరిమానా విధించారు.