21 June, 2026 | 4:19 PM

గిర్రున తిరుగుతున్న కరెంట్ మీటర్లు

16-06-2024 01:06 AM
  • గ్రేటర్‌లో పెరుగుతున్న విద్యుత్ వినియోగం 

9 సర్కిళ్లలో 64 లక్షల కనెక్షన్లు 

2023తో పోల్చితే 2024లో అధికంగా వాడకం 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్ మహా నగరం లో రోజురోజుకూ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గతేడాదిలో ఇదే టైమ్‌తో పోల్చితే ఈ ఏడాది కరెంట్‌ను అధికంగా వినియోగించారు. ప్రస్తుతం వానకా లం సీజన్ ప్రారంభమైనప్పటికీ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుత మాసంలో కొనసాగుతున్న విద్యుత్ వినియోగం గతేడా ది జూన్ కంటే అధికంగా నమోదు కావడం విశేషం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 

ప్రతి ఏడాది 15 శాతం.. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్, సౌత్, బంజారాహిల్స్, సికిం ద్రాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌న గర్ సర్కిళ్లు, మేడ్చల్ జిల్లా పరిధిలోని మేడ్చ ల్, హబ్సీగూడ సర్కిళ్ల పరిధిలో దాదాపు 64 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈసారి గతేడాది కంటే 4 లక్షల కనెక్షన్లు అధికమయ్యాయి. గ్రేటర్‌లో నిర్మాణాలు విస్తరిస్తున్న కారణంగా ప్రతి ఏడాది 12 నుంచి 15 శాతం విద్యుత్ కనెక్షన్లు పెరుగుతున్నట్టుగా అధికారుల అంచనా. ఎండాకాలంలో భానుడి భగభగలు తట్టుకునేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు ఆశ్రయించడం వల్ల వినియోగం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఓ వైపు వర్షా లు కురుస్తున్నా వినియోగం మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కొనసాగడమే కాకుండా అధికంగా నమోదవుతోంది.