నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి
- ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్
గజ్వేల్, జూన్ 15: ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాశాఖ నిరంతర కృషి చేస్తోందని ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ డీ రాజేందర్ సింగ్ అన్నారు. శనివారం గజ్వేల్ బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాల ల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ గణపతిరావు, అధ్యాపకులు డాక్టర్ రమేశ్‌బా బు, బాలరాజు, విజయభాస్కర్ రెడ్డి, రామచంద్రం, పెద్దిరాజు, కవిత తదితరులు పాల్గొన్నారు.






