21 May, 2026 | 3:18 AM

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన వ్యక్తుల బైడోవర్

21-05-2026 01:58 AM

చింతలపాలెం మే 20 : గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన వ్యక్తులను గుర్తించి తాసిల్దార్ ముందు బైండోవర్ చేసిన ఘటన బుధవారం జరిగింది. చింతలపాలెం ఎస్త్స్ర పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 18న మండల పరిధిలోనీ పాత కిస్టాపురం గ్రామంలో గల ఒక గుడిలో కొంతమంది వ్యక్తులు గుప్త నిధుల కొరకు అక్రమ త్రవ్వకాలకు పాల్పడుతున్నారని సమాచారంతో పోలీస్ సిబ్బంది రైడ్ చేసి ఐదుగురు వ్యక్తులను పట్టుకున్నట్టు తెలిపారు.

వీరిని మఠంపల్లి, హుజుర్నగర్ ప్రాంతాలకు చెందిన మట్టపల్లి లక్ష్మీనారాయణ, అమరబోయిన నరసింహారావు, షేక్ మస్తాన్. ఎల్లేశ్వరి అశోక్, షేక్ సైదాలుగా గుర్తించి వారి నుండి గడ్డపారలు, పారలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా స్థానిక తాసిల్దారు ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు.