శ్రమశక్తి అవార్డు గ్రహీత చిలుకు స్వామికి ఘన సన్మానం
ఆలేరు, మే 20 : శ్రమశక్తి అవార్డు గ్రహీత డా. చిలుకు స్వామికి ఘన సన్మానం ను బుధవారం రోజున కెసిఆర్ ఫంక్షన్ హాల్ శారాజిపేట, కొల్లూరు గ్రామంలో జరిగింది, రైల్వే కార్మికుల కొరకు చేసిన సేవలకే శ్రమశక్తి అవార్డుకి స్వామి ఎంపిక చేయడం జరిగింది, సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ లో కార్మికులకు చిలుకు స్వామి అందించిన సేవలు ప్రశంసనీయమని , సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు తో గౌరవించడం అభినందనీయమని ఆలేరు మాజీ శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భముగా చిలుకు స్వామిని ఘనంగా సన్మానించారు. అనంతరం చిలుకు స్వామి మాట్లాడుతూ శ్రమ శక్తి అవార్డు నా వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, ఇది ప్రతి కార్మికుడి చెమటకు, కష్టానికి వచ్చిన గౌరవం, ఈ అవార్డును అందజేసిన గౌరవ ముఖ్యమంత్రికి, కార్మిక శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే ఉద్యోగుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం నేను చేసిన ప్రయత్నాలకు ఈ గుర్తింపు రావడం నా బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ సెక్రెటరీ రవీందర్, దేవులపల్లి రాఘవేందర్, రాజేందర్ , ఏలేందర్ కుమారస్వామి, తిరుపతిరావు ,బండ మహేందర్, మొగలగాని మల్లేశం, జూకంటి అనిల్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.






