ఇక్ఫాయ్‌లో యాసిడ్ ఘటనపై విచారణ చేపట్టాలి
బాధిత విద్యార్థినికి న్యాయం జరగాలి
ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఇక్ఫాయ్) యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై విచా రణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇక్ఫాయ్ వర్శిటీకి విద్యార్థుల నుండి లక్షల రూపాయలు వసూళ్లు చేయడంపై ఉన్న శ్రద్ధ వారి రక్షణపై లేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్య క్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, నాగరాజు ఆరోపించారు. విద్యార్థులపై జరుగుతున్న ర్యాగింగ్‌ను నివారించేందుకు యూ నివర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకోవడంలేదని వారు విమర్శించారు. బకెట్‌లో యాసిడ్ పోసి ప్రాణాలు తీసే చర్యలు తోటి విద్యార్థులు చేశారంటే ఆ విద్యాసంస్థలో విద్యార్థులకు రక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చికిత్స పొందుతున్న విద్యార్థినికి మెరుగైన చికిత్సను అందించాలని వారు డిమాండ్ చేశారు.




