27 March, 2026 | 5:06 PM

తుంగతుర్తిలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

27-03-2026 03:24 PM

కళ్యాణానికి ఆనవాయితీగా రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి  తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందజేత

తుంగతుర్తి,(విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగ రంగ వైభవంగా శుక్రవారం మధ్యాహ్నం సీతా రామ లక్ష్మణ విగ్రహాలను ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించి, వేద పండితులైన రామాచార్యులు శేషు శర్మ, పండే శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలు చేసి, శ్రీరామ పేరుతో తలంబ్రాలు సేకరించి, గ్రామస్తులంతా కూర్చొని శ్రీరామ జపం చేస్తూ, సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పాటల రూపంలోని డ్యాన్సులతో, ఘనంగా ,కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఎనగందుల సంజీవ, సర్పంచ్ మల్లెపాక సాయి బాబా, తల్లాడ కేదారి, ఉప సర్పంచ్ ఎనగందుల శ్రీనివాస్, సంకినేని గోవర్ధన్ రావు, మేనేని మాధవరావు, ఉప్పుల రాంబాబు, ఎనగందుల గిరి, కటకం కిష్టయ్య, పెండెం రామ్మూర్తి, గుడుపూరు శ్రీనివాసరావు, కొండా రాజు, బండారు దయాకర్, తదితరులు పాల్గొన్నారు