13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

27-03-2026 03:28 PM

సీతారామ చంద్రుల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

కామారెడ్డి,(విజయక్రాంతి): శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే మదన్మోహన్రావు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

దేవాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు సహకారంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రంగు రవీందర్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రంగు రవీందర్ గౌడ్, ఆలయ ఈవో బూర్ల ప్రభు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీతారామచంద్రుని కళ్యాణం ఉత్సవాలలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.