6 July, 2026 | 1:06 PM

Breaking News

ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •   పారిశుద్ధ్యం... పంచాయతీ కేంద్రాల్లో అధ్వానం   •   శిథిలావస్థకు చేరిన బేల తహసీల్దార్ కార్యాలయం   •  

యూట్యూబ్ రిపోర్టర్‌పై రౌడీషీటర్ కత్తిపోట్లు

08-08-2024 03:04 AM

అడ్డుకోబోయిన వారిపైనా దౌర్జన్యం

రాజేంద్రనగర్, ఆగస్టు 7: ఓ రౌడీషీటర్ రెచ్చిపోయాడు. తన అరాచకాలు వెలుగులోకి తీసుకొచ్చాడని కక్షగట్టిన అతడు ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌పై దాడి చేశా డు. అడ్డుకోబోయిన వారిపైనా దౌర్జ న్యం చేశాడు. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన ముబీన్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆయన స్థానికంగా నివాసం ఉండే రౌడీషీటర్ సోహెల్ అరాచకాలపై వార్తలు ప్రసారం చేశాడు.

సంబం ధిత లింకులు ఛానల్ నుంచి తొలగించకపోతే చంపేస్తానని ముబీన్‌ను రౌడీషీటర్ బెదిరించసాగాడు. అయినా కూడా తొలగించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి ముబీన్ వట్టెపల్లి మైమూద హోటల్ సమీపంలో ఉండగా సోహెల్ తన అనుచరులతో వచ్చి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డుకోబోయిన వారిపైనా దౌర్జన్యం చేశాడు. తీవ్రంగా గాయపడిన ముబీన్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సోహెల్ కోసం గాలిస్తున్నారు.