29 June, 2026 | 11:08 PM

యాదాద్రిలో భక్తుల బారులు

05-08-2024 01:48 AM

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 4 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధికి  ఆదివారం భక్తులు పోటెత్తారు.  ఆషాఢం చివరి రోజు అమవాస్య కావడంతో  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రసాదాల కౌంటర్, దర్శన క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్మదర్శనానికి 2 గంటలు పట్టింది. సాయంత్రం లక్ష్మీనృసింహుల వెండిజోడి సేవ సంప్రదాయరీతిలో నిర్వహించారు. ఆలయ సన్నిధిలో సోమవారం నుంచి శ్రావణ మాస సందడి ప్రారంభం కానుంది.