16 March, 2026 | 4:37 AM

అంగన్వాడీలకు రూ.156 కోట్లు విడుదల

17-10-2025 01:25 AM

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : రాష్ర్టంలోని అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహార పథకం కింద సరఫరా చేసిన వస్తువుల బి ల్లుల కోసం అవసరమైన నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది.

రాష్ర్ట మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా వస్తువులు, కూరగాయలు, గ్యాస్ సరఫరాలు, ఇంటి అద్దెల వంటి ఖర్చుల కోసం మొత్తం రూ.156 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లోపు అన్ని జిల్లాలు తమ బిల్లులను ఆన్‌లైన్ ద్వారా సమర్పిం చాలని అధికారులను డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది.