17-10-2025 01:23:43 AM
పార్టీ అధికార ప్రతినిధి జగన్
హుస్నాబాద్, అక్టోబర్ 16(విజయక్రాంతి) :తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శా తం రిజ ర్వేషన్ సాధన కోసం ఈనెల 18న నిర్వహించబోయే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునిచ్చింది.
ఈమేరకు గురువారం ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ కు దారితీసిన ఆ ప్రకటనలో ఆయన, ‘కరుడు కట్టిన మనువాద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రతి నిధులు, ప్రజాసంఘాలు కలసి పోరాడాల్సిన సమ యం ఇది. ఆర్‌ఎస్‌ఎస్, -బీజేపీ ఫాసిస్టు విధానాలను ఎదుర్కోవటానికి ప్రజా ఐక్యత తప్ప మరే దారి లేదు‘ అని పేర్కొన్నారు.
మావోయిస్టు పిలుపుతో తెలంగాణ అంతటా బంద్ చర్చలు వేడెక్కుతున్నా యి. అన్నిచోట్లా బీసీ రిజర్వేషన్ అం శం చర్చనీయాంశమైంది. ఆ ప్రకటనలో జగన్ తీవ్రమైన ఆరో పణలు చేశారు.గత 11 ఏండ్లుగా ఆర్‌ఎస్‌ఎస్, -బీజేపీ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి వర్ణవ్యవస్థను తిరిగి బలపరుస్తోంది అని అన్నారు. రాజ్యాంగ సమానత్వ భా వజాలం స్థానంలో మనుస్మృతిని అమలు చేస్తున్నా రు అని అన్నా రు.
కేంద్ర పాలనను ఫాసిస్టు నియంతృత్వంగా పేర్కొంటూ, ఈవ్యవస్థ దళితులు, ఆదివా సీలు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీల అస్తిత్వాన్ని నా శనం చేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. తర్వాత ఒక ఆర్డినెన్స్ కూడా పంపింది. మన రాజ్యాంగం ఫెడరల్ స్వరూపంలో ఉంది. స్థాని క సంస్థల విషయం రాష్ట్ర పరిధిలోనిదే.
ఈ బిల్లును కేంద్రం అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం అని జగన్ పేర్కొన్నారు.అలాగే జగన్ తన ప్రకటనలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసమానతలకు కారణం కార్పొ రేట్ అనుకూల ఆర్థిక విధానాలని అన్నారు. గత 30 ఏండ్లుగా ఆర్థిక వ్యవస్థను పెద్ద కంపెనీల చేతుల్లో పెట్టేశారు. ఇప్పుడు మనువాదులు దానిపై వర్ణవ్యవస్థ ఆలోచనను అతికించుతున్నారు. దీని ఫలితంగా సామాజిక, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి అని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభు త్వం, ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాలు కలసి కేం ద్రంపై చట్టపరమైన ఒత్తిడి తెచ్చే దిశగా కదలాలని ఆయన సూచించారు. పార్లమెంటులో చట్టం ద్వా రానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అందుకో సం అన్ని పార్టీలు, విద్యార్థి, మేధావి వర్గాలు ఐక్యమై ప్రజా ఉద్యమం చేపట్టాలి అని ఆయన పిలుపునిచ్చారు.