calender_icon.png 4 May, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోళ్లలో రూ.3వేల కోట్ల కుంభకోణం

04-05-2025 01:20:04 AM

క్వింటాల్‌కు రూ.2 వేల మేర నష్టపోయిన రైతులు

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): ఎనభై శాతం పత్తిని సీసీఐ కొనుగోలు చేసిందని రికార్డులు చెబుతున్నా, కేవలం 20 శాతం మంది రైతులే సీసీఐకి అమ్మారని, మిగతా అంతా కాంగ్రెస్ నేతలు సిండికేట్‌గా ఏర్పడి సీసీఐకి అమ్ముకున్నారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు.

సీసీఐ పత్తి కొనుగోళ్లు ఆలస్యం చేయడం వల్ల రూ.3 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఆ సొమ్ము ట్రేడర్లు, బ్రోకర్ల అకౌంట్లలో పడ్డాయని ఆయన ఆరోపించారు. దీనిలో సీసీఐ, మార్కెటింగ్ అధికా రుల హస్తం ఉందన్నారు. ఈ స్కామ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

శనివా రం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ 2024 25 లక్షల మంది రైతులు 49 లక్షల బేళ్ల పత్తిని పండించారని, సీసీఐ కొన్నది 41 లక్షల బేళ్లయితే 8 లక్షల బేళ్లు ప్రైవేట్ ట్రేడింగ్ జరిగిందన్నారు. సీసీఐకి అమ్మిన రైతులు 6 లక్షల 30 వేల మాత్రమేనని, ట్రక్ పట్టీలు జారీ చేసినవి 9 లక్షలు మాత్రమేనని, 60 వేల టీఆర్‌లు ప్రభుత్వం ఇచిం దన్నారు. పత్తి క్వింటాల్‌కి రూ.7,521 అయి తే, ప్రైవేట్ మార్కెట్‌లో రూ.5,500 మించలేదని అన్నారు.

రైతులు తమ పత్తి పంటను క్వింటాల్‌కి రూ.5 వేలకు అమ్ముకుంటే, బ్రోకర్లు రూ.7వేలకు పైగా దండుకున్నారని, దీతో రైతులు క్వింటాల్‌కి రూ.2 వేలు నష్టపోయారని వాపోయారు. దీపావళి సంద ర్భంగా హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హో టల్‌లో సీసీఐ అధికారులు, ప్రముఖ ట్రేడర్ల మధ్య రహస్య సమావేశంలో కుంభకోణానికి బీజం పడిందని సుదర్శన్ రెడ్డి ఆరో పించారు. పత్తి కొనుగోళ్లలో ఏడుగురు మా ర్కెట్ కమిటీ కార్యదర్శులు సస్పెండ్ అయ్యారని, కొంతమందికి షోకాజ్ జారీ అయినట్టు ఆయన తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె గోవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.