calender_icon.png 4 May, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్

04-05-2025 01:17:18 AM

  1. 7 నుంచి సమ్మెకు పిలుపు
  2. పునరాలోచించాలన్న సీఎం రేవంత్, మంత్రి పొన్నం
  3. చర్చలకు పిలవకుండా విరమణ కుదరదంటున్న కార్మికులు

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఆర్టీసీ సమ్మెకు సిద్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్నిసార్లు విన్నవించినా సర్కార్ నుంచి సహేతుకమైన స్పందన రాకపోవడంతో గత్యంతరం లేక సమ్మెకు పిలుపునిచ్చినట్టు ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది.

మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఎన్నిసార్లు తమ సమస్యలపై విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకుండా.. ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోతున్న దశలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం సమ్మెపై కార్మికులు పునరాలోచాలని చెప్ప డం సరికాదని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. ఇన్నాళ్లు ఏమాత్రం స్పం దించకుండా ఉండి, ఇప్పుడు కనీసం చర్చలకు కూడా పిలవకుండా సమ్మె విరమించ మని కోరితే కుదరదని అంటున్నారు.

సంస్థ ను కాపాడుకోవాలన్నదే తమ తాపత్రయమైతే... ప్రైవేట్ పరం చేసి ఆర్టీసీ లేకుండా చేయాలన్నది సర్కారు ఉద్దేశంగా కనిపిస్తోందని జేఏసీ ఆరోపిస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో కనీసం పైసా ఖర్చు కూడా అవ్వని ట్రేడ్ యూనియన్ పునరుద్ధరణపైనా ఈ సర్కార్ పట్టిం చుకోకుండా సమ్మెను విరమించాలని కోరి తే వారి చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతుందని జేఏసీ పేర్కొంటుంది.

ఆర్టీసీ కార్మికు లు సమ్మెకు పోవడానికి ప్రధాన కారణం ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు. ఈ బస్సుల ద్వారా ఆర్టీసీని నేరుగా ప్రైవేట్ పరం చేస్తారనే అనుమానం కార్మికుల్లో బలపడింది. కొన్ని డిపోలను సైతం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడంతో కార్మికుల్లో ఆందోళన పెరిగింది. ఎలక్ట్రిక్ బస్సులను కార్పొరేట్ సంస్థలకు కాకుండా నేరుగా ఆర్టీసీకే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 

కార్మికుల సొమ్ములు వాడుకుంటున్న యాజమాన్యం

తమ వేతనం నుంచి పొదుపు చేసుకున్న డబ్బులను కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంటోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సీసీఎస్, ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీ, పీఎఫ్ తదితర సంక్షేమ పథకాల డబ్బులు వాడుకున్నారని, వాటిని యాజమాన్యం వెంటనే ఇప్పిం చాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రతినెలా ప్రభుత్వం యాజమాన్యానికి మహాల క్ష్మిప థకం డబ్బులు ఎంత ఇస్తున్నారనే దానిపై పారదర్శకతే లేదని.. ప్రభుత్వం ఎం త చెల్లిస్తుందో యాజమాన్యం చెప్పడం లేదని జేఏసీ నాయకులంటున్నారు. మంత్రులు, సీఎం మాత్రం ఆర్టీసీని లాభాల్లోకి తీసుకుపోయామని గొప్పలు చెప్పుకుంటున్నారని పేర్కొంటున్నారు.

తమను చర్చలకు పిలిచి, సమస్యలను పరిష్కారిస్తేనే సమ్మె ఆగుతుందని స్పష్టం చేశారు. ప్రధానంగా కార్మికుల సమస్యలన్నింటికీ ఎండీనే కారణమనే భావన ఆర్టీసీ కార్మికుల్లో కనిపిస్తోంది. ఆయన్ను మార్చి, కొత్త ఎండీని నియమిస్తే సమ్మెపై కార్మికులు కాస్త చల్లబడే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. 

ఆర్టీసీ ప్రధాన డిమాండ్లు..

ఆర్టీసీ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు వేతన సవరణ, ఎరియర్స్ చెల్లింపు, రిటైర్డ్ ఉద్యోగుల వేతన సవరణకు పేఫిక్సేయన్, బ్రెడ్ విన్నర్ స్కీం ఉద్యోగులకు కన్సాలిడేటెడ్ పే కాకుండా రెగ్యులర్ వేతనాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెన్‌ఫిట్స్ చెల్లింపు, కార్మికులపై విపరీతమైన పనిభారం తగ్గింపు, బ్రీత్ అనలైజర్ల పేరిట కార్మికులపై వేధింపులు ఆపడం, ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ఆపేసి ఈవీలను నేరుగా సంస్థకే అప్పగించడం, ఖాళీగా ఉన్న పోస్టుల నియామకం చేపట్టాలని తదితర 23 డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ గత నెల 7వ తేదీన ఆర్టీసీ యాజమాన్యం, లేబర్ కమిషనర్‌కు సమ్మెకు నోటీసులు ఇచ్చింది. 

సమ్మెపై సర్కారు మల్లగుల్లాలు..

ఆర్టీసీ సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుండటంతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంతో పాటు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించినట్టు సమాచారం. సీఎస్ కూడా ఆర్టీసీ సమ్మెపై అధికారులతో సమాలోచన చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్తే పరిస్థితి ఏంటనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి సైతం అధికారులు వివరించినట్టు తెలుస్తోంది. 

సీఎం స్పందన కోసం ఎదురుచూస్తున్నాం

సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ సమ్మెపై సానుకూలంగా మాట్లాడటంతో తమ కు కాస్త నమ్మకం ఏర్పడింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే మమ్మ ల్ని చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరిస్తే సమ్మె విరమించేందుకు అవ కాశం ఉంది. మా సమస్యలను సీఎం పరిష్కరిస్తారని నమ్మకం ఉంది. ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నాం.

 ఆర్టీసీ జేఏసీ చైర్మన్ 

ఈదురు వెంకన్న

పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నందుకే

మా సమస్యలపై ఏ మా త్రం పట్టింపు లేకుండా ప్రవర్తించినందుకే సమ్మె నోటీసు ఇవ్వాల్సి వ చ్చింది. మేం కొత్తగా ఏదీ డిమాండ్ చేయడం లేదు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే నెరవేర్చ మని అడుగుతున్నాం. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కనీసం చర్చలకు కూడా పిలవడం లేదు.

 థామస్‌రెడ్డి, 

ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్