calender_icon.png 3 November, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాఫ్ట్‌వేర్‌కు రూ.1.87లక్షల టోకరా

01-11-2025 12:18:39 AM

బెంగళూరు, అక్టోబర్ 31: బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డెలివరీ స్కామ్‌లో రూ.1.87లక్షలను మోసపోయాడు. అమెజాన్ ద్వారా ఖరీదైన శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయగా, ఒక టైల్ ముక్క డెలివరీ అయ్యింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రేమానంద్ గత నెల 14న అమెజాన్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను తన క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.1.87లక్షలు చెల్లించి, ఆర్డర్ పెట్టాడు.

గత నెల19న డెలివరీ రావడంతో తీసుకున్న అతను, సీల్ ప్యాకేజీని తొలగిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. అందులో స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా టైల్ ముక్కను చూసి, ఆశ్చర్యపోయాడు. ‘నేను రూ.1.87 లక్షల విలువైన శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7ని కొనుగోలు చేశాను. కానీ నాకు దీపావళికి ఒక రోజు ముందు ఫోన్‌కు బదులుగా ఒక రాయి(టైల్) ముక్క వచ్చింది. ఈ సంఘటన నా ఆనందాన్ని, పండుగ స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేసింది.

ఆన్‌లైన్‌లో, మరీ ముఖ్యంగా అమెజాన్‌లో కొనుగోలు చేసేటప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని ప్రేమానంద్ కోరాడు. తనకు జరిగిన మోసంపై అతను వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)లో, కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.