01-11-2025 12:20:46 AM
సెక్స్ కుంభకోణంలో యువరాజు పేరు ఉండటంతో కీలక నిర్ణయం
అమెరికా, అక్టోబర్ 31: బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ ౩ తన సోదరుడు, యువరాజు అండ్రూపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూను ఇంటి నుంచి వెళ్లగొట్లారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసులో ప్రముఖ రాజకీయ నేతలు, ధనవంతులతో పాటు బ్రిటన్ యువరాజు అండ్రూ పేరు కూడా బయటకొచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో బ్రిటన్ రాజు చార్లెస్ అండ్రూను ఇంటి నుంచి బలవంతంగా గెంటేసేడంతో పాటు ఆయనకున్న బిరుదలన్నింటినీ తొలగించినట్లు బకింగ్‌హోమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా సెక్స్ కుంభకోణంలో తన పేరు బయటకు రావడంతో ఆండ్రూ తనకున్న రాయల్ టైటిల్‌ను ఇటీవల వదులుకున్నారు. దివంగత రాణి ఎలిజబెత్ రెండో కుమారుడు, చార్లెస్ తమ్ముడు ఆండ్రూ జెఫ్రీ ఎప్‌స్టున్ సెక్స్ కుంభకోణం కేసు పత్రాల్లో పేరు బయటకు వచ్చినప్పటి నుంచి ఆండ్రూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.