తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాడు లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదిలాబాద్ -69.81 శాతం, భువనగిరి -62.34 శాతం, చేవెళ్ల -53.15 శాతం, హైదరాబాద్-39.17 శాతం, కరీంనగర్-67.67 శాతం, ఖమ్మం-70.76 శాతం, మహబూబాబాద్-68.60 శాతం, మహబూబ్‌నగర్-68.40 శాతం, మల్కాజిగిరి-46.27 శాతం, మెదక్-71.33 శాతం, నాగర్ కర్నూల్ -66.53 శాతం, నల్గొండ-70.36 శాతం, నిజామాబాద్-67.96 శాతం, పెద్దపల్లి-63.86 శాతం, సికింద్రాబాద్ -42.48 శాతం, వరంగల్-64.08 శాతం, జహీరాబాద్-71.91 శాతం నమోదైంది. సికింద్రబాద్ కంటోన్మెంట్ లో 47.88 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయం 4 గంటలకే ముగిసింది. 5 ఎంపీ నియోజకవర్గాల్లోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసింది. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 వరకు పోలింగ్ ముగియనుంది. క్యూ లైన్లలో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.




