calender_icon.png 30 December, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫామ్‌హౌజ్‌లకు డిమాండ్

30-12-2025 02:03:21 AM

ఇక న్యూ ఇయర్ వేడుకలకు అక్కడే

కరీంనగర్, డిసెంబరు 29 (విజయ క్రాంతి): న్యూ ఇయర్ వేడుకలకు హోటళ్లు, క్లబ్బులు ఓల్ ట్రెండ్ ఫామ్ హౌస్లు, రిసార్ట్లే నయా ట్రెండ్ కావడంతో ఫామ్ హౌస్ లకు డిమాండ్ ఏర్పడింది. నగరానికి దూరంగా మద్యం మజాలో డీజేల హోరు.. డ్యాన్సులు, కేకల మధ్య ఆనందంపుటంచులను తాకితే అదే అసలైన పార్టీ గా భావిస్తున్న వారికి ఫా మ్ హౌస్ లు అడ్డాగా మారాయి. అడిగేవారు, అడ్డు చెప్పేవారూ ఉండరనే భావన తో పార్టీ ప్రియులు ఫామ్ హౌస్ లకు వెళ్లేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. సాధారణంగా న్యూ ఇయర్ పార్టీలు అనగానే పోలీసుల ఆంక్షలుంటాయి.

ఆ రోజు రాత్రంతా తనిఖీలుంటాయి. ఈ తలనొప్పులెందుకని చాలా మంది ఏ గోవాకో.. దుబాయ్కో వెళ్లి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడీ ధోర ణి మారుతోంది. ఇప్పటికే కిట్టీ పార్టీలంటూ వీకెండ్స్లో ఫామ్ హౌస్లకు వెళ్లి మజా చేస్తున్న పార్టీ ప్రియులు.. న్యూ ఇయర్ వేడుకలకూ అవే బెటర్ అంటున్నారు. నలుగురు నుంచి పదిమంది దాకా పోగై కొందరు.. కుటుంబసభ్యులతో ఇంకొందరు ఫామ్ హౌస్ లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇందు కు నగర శివార్లలో ఉన్నవాటిని బుక్ చేసుకుంటున్నారు. ఫామ్హౌస్లలో మూడు లేదా నాలుగు బెడ్రూమ్లు, పార్టీ హాల్, ఔట్డోర్ లాన్, స్విమ్మింగ్పూల్ లు ఉన్న వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది. న్యూ ఇయర్ వేడుకల కోసం కరింనగర్ శివారులో ని తి మ్మాపూర్, రేణికుంట, నుస్తులాపూర్, మానకొండూర్, చెంజర్ల, దుర్షేడ్, బొంతగుం టపల్లి, గర్రెపల్లి, నగునూర్, కొత్తపల్లి, మల్కాపూర్, చింతకుంట తదితర ప్రాంతాల్లోని ఫా మ్హౌస్ లకు డిమాండ్ పెరిగిపోయింది. 

కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో గతంతో పోలిస్తే 10 వేలు ఆ పైనే అధిక రేట్లను నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ‘డిసెంబరు 31 రాత్రి’ కోసం కనీసం 20 వేల నుంచి 1. 50 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. సౌండ్ సిస్టంకు కరెంట్ చార్జీలు అదనమే. అయినా సరే ఈ ఖర్చుకు పార్టీ ప్రియులు వెనుకాడటం లేదు. న్యూ ఇయర్ మజా కోసం ఎంతైనా చెల్లించేందు కు రెడీ అయిపోయారు.

ఫ్యామిలీలు కూడా ఫామ్హౌస్లకు చేరుతున్నాయి. నాలుగైదు కుటుంబాలు కలిసి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నా రు. ఫామ్హౌస్లపై నిఘా పెంచాలని పోలీసులు నిర్ణయించారు. ఫామ్హౌస్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, డీజే సౌండ్లతో ఇబ్బంది కలిగిస్తు న్నారంటూ చుట్టుపక్కల వారి ఫిర్యాదులతో నిఘా పెంచాలని నిర్ణయించాయి.