18 March, 2026 | 12:01 PM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

శ్రీశైలానికి కొల్లాపూర్ నుంచి ఆర్టీసి బస్సు..!

15-09-2024 01:36 PM

పచ్చ జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి                    

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: కొల్లాపురం పట్టణం నుండి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఆర్టీసీ బస్సును పచ్చ జెండా గోపి ప్రారంభించారు.  ఉదయం 9 గంటల నుండి రెండు గంటల వరకు శ్రీశైలానికి వెళ్లి 2:30 నుండి తిరిగి కొల్లాపూర్ పట్టణానికి 6 గంటల వరకు చేరుకునెలా ఎక్స్ప్రెస్ బస్సు ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  మొదటిరోజు 30 మందితో శ్రీశైలానికి వెళుతూ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.  దీంతో పాటు వీపనగండ్ల మండల కేంద్రం నుండి గోపాల్ దిన్నె మీదుగా కర్నూలు వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. వారితోపాటు డిపో మేనేజర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.