ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి
డిపో మేనేజర్‌కు బీజేపీ నాయకుల వినతి
బాన్సువాడ, జూన్ 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ కార్గో సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ మంగళవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బాన్సువాడలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ కార్గో కేంద్రం ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగేదని, ప్రస్తుతం ఆ సేవలు నిలిచిపోవడంతో పార్సిళ్లు పంపడం, స్వీకరించడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,అందువల్ల కార్గో కేంద్రాన్ని పునరుద్ధరించి బాన్సువాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆర్టీసీ కార్గో సేవలను తిరిగి ప్రారంభించాలని డిపో మేనేజర్ రవి కుమార్ ను కోరారు.
ప్రజలకు మెరుగైన రవాణా, కార్గో సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాజీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్ బీజేపీ జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ ప్రసాద్ చీకట్ల రాజు బిజెపి మాజీ మండల అధ్యక్షులు సాయి బాబా బిజెపి నాయకులు మహేందర్ కొండని గంగారం శంకర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.






