10 August, 2026 | 3:27 AM

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

10-08-2026 12:46 AM

మేడ్చల్ అర్బన్, ఆగస్టు 9(విజయక్రాంతి):మేడ్చల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్,కండక్టర్ లు నిజాయితీ చాటుకున్నారు. మేడ్చల్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్ నంబర్ 215/2 పఠాన్ చెరువు నుండి జూబ్లీ బస్ స్టేషన్ కు వెళ్ళే సమయంలో ప్రయాణికుడు సాప్ట్ వేర్ ఉద్యోగి ప్రశాంత్  తన బ్యాగ్‌ను బస్‌లో మరచిపోయాడు.

అందులో రూ.2 లక్షలతో పాటు ఆపిల్ ల్యాప్ టాప్, పర్సు ఉన్నాయి. బ్యాగ్‌లో నగదు విలువైన  వస్తువుల గురించి సంబధిత అసిస్టెంట్ డిపో మేనేజర్ సిఐ రామ రావు దృష్టికి కండక్టర్ గోవింద్ తీసుకెళ్లారు. డ్రైవర్,కండక్టర్ లు సాప్ట్ వేర్ ఉద్యోగి ప్రశాంత్ కు అసిస్టెంట్ డిపో మేనేజర్ రామ రావు సమక్షంలో నగదుతో పాటు వివిధ విలువైన వస్తువులను అప్పజెప్పారు. సాప్ట్ వేర్ ఉద్యోగి మేడ్చల్ ఆర్టీసీ డిపో డ్రైవర్,కండక్టర్ ఎండి ఇస్మాయిల్,గోవింద్ ల నిజాయితీని కొనియాడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు...