24 April, 2026 | 7:21 PM

ఆర్టీసీ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలి

24-04-2026 05:28 PM

నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ 

ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మీకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో శుక్రవారం రోజు ఆర్టీసీ జేఏసి కార్మీకుల కు మద్దతు తెలుపారు. ఆర్టీసీ డిపో వద్ద కార్మీకులతో కలిసి ఆంధోళనలో పాల్గొని నిరసన తెలిపారు. కార్మీకులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బస్టాండ్ నుండి కార్మీకులతో కలిసి  అమరవీరుల స్థూపం వరకు మేయర్ శాంతి ర్యాలీ నిర్వహించారు.

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ...సంతాపం ప్రకటించారు. ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ....ఆర్టీసిని ప్రభుత్వం లో విలీనం చేస్తూ... కార్మీకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు చంద్ర, దేవసాని సరస్వతి, మాసం గణేష్, తోట అనిల్ మరియు ఆర్టీసీ యూనియన్ నాయకులు,  కార్మీకులు పాల్గొన్నారు.