31 May, 2026 | 5:24 PM

ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈజీఎస్)లో ఉద్యోగుల వాటాపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి

31-05-2026 04:34 PM

పిఆర్టియూ పునర్నిర్మాణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కార్లు సురేష్

మంథని,(విజయక్రాంతి): గత ప్రభుత్వాలు అమలులోకి తేనటువంటి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ ఉపాధ్యాయుల ఉచిత ఆరోగ్య పథకం ఈజీఎస్ అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉద్యోగ ఉపాధ్యాయుల వాటా వారి మూల వేతనంలో 1.5 శాతంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని పీఆర్ టీయూ రాష్ట్ర పునర్నిర్మాణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కర్రు సురేష్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

ప్రభుత్వాలు ప్రజలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల బాధ్యత వహించాలని కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యం అందించిటకు ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీ వారి కంటే ఎక్కువ వాటాను  సేకరించడం, మూల వేతనం పై ఆధారపడి వాటా కేటాయించడం వలన, ఈ నగదు రహిత ఆరోగ్య పథకం పై పూర్తి మార్గదర్శకాలు ఇంకా  విడుదల చేయక ముందే, ఈ మార్గదర్శకాల పై ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రతినిధుల తో చర్చించకుండానే మూల వేతనంలో 1.5 శాతం ప్రభుత్వం కోత పెట్టడంపై ఉద్యోగ, ఉపాధ్యాయుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని వెంటనే ప్రభుత్వం ఈజీ ఎస్ పథకం విషయం వైద్యం అందించే స్లాబ్ లు ఇతర అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులతో చర్చ జరిపిన తర్వాతనే శాస్త్రీయంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల వాటా, వైద్యం విషయంలో హాస్పిటల్స్ కు ప్రభుత్వం చెల్లించే స్లాబ్ ల గురించి చర్చ జరుపాలని,

ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ పథకం అభాసుపాలు కావద్దు అని భావిస్తున్నామని,కావున ప్రభుత్వం తరపున ఒక కమిటీ ని ఏర్పాటు చేసి ఈ ఆరోగ్య పథకం పై శాస్త్రీయ అధ్యయనం చేసి పటిష్ట అమలు కు చర్యలు చేపట్టడమే కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల వాటా వారి మూల వేతనం పై 1.5 శాతం కాకుండా అందరికీ ప్రతినెల సముచిత సమాన వాటా కేటాయించి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి అందులో ఉద్యోగ, ఉపాధ్యాయులను భాగస్వాములు చేసినప్పుడే ఈ పథకం విజయవంతం అవుతుందని తెలియజేస్తూ, త్వరలోనే ఈ ఈజీఎస్ పథక అమలు విషయంలో సమస్యల గురించి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ దృష్టి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కర్రు సురేశ్  ఒక ప్రకటన లో తెలియజేశారు.