26 March, 2026 | 12:25 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలి

08-02-2025 08:00 PM

హయత్ నగర్ డిపోలో గేట్ మీటింగ్...

ఎల్బీనగర్: హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. హయత్ నగర్ డిపోలో శనివారం వన్ చేంజ్ ఓవర్ సమయం సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. గేట్ మీటింగ్ లో జేఏసీ నాయకుడు కత్తుల యాదయ్య మాట్లాడుతూ... హక్కుల సాధనకు సమ్మెకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని, 2021 పే స్కేలు వెంటనే చేయాలని, 2017 పే స్కేల్ ఏరియర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు సెటిల్మెంట్ వెంటనే  చెల్లించాలని, ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని, సిసిఎస్ ఎస్ఆర్బిఎస్ పీఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ జేఏసీ పిలుపు మేరకు సమ్మెకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జి.రాములు, ఆమనగంటి వెంకన్న, వెంకట్, దశరథ, ప్రసాద్ యు.పి.చారి. ప్రకాశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.