13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ

26-03-2026 01:44 AM
  1. నిజామాబాద్ నుంచి రాజకీయ శంఖారావం
  2. పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా ఇప్పటికే ఖరారు

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. శ్రీరామ నవమి సందర్భంగా కవిత మెట్టినిల్లు అయి న నిజామాబాద్ నుంచే పార్టీ ఆవిష్కరణ చేయనున్నట్లు సమాచారం. ఆ రోజు ఉదయం జరిగే మీడియా సమావేశంలో పార్టీ పేరు, జెండా, ఎజెండాను ఆమె వెల్లడించనున్నారు. పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై కూడా స్పష్టమైన దిశను కవిత తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.

మహిళలు, యువత, సామాజిక వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పార్టీ విధానాలను రూపొందిస్తున్నారని సమీప వర్గాలు చెపుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టే వ్యూహంపై ఇప్పటికే చర్చలు జరిగాయని సమాచారం. అదే వేదికగా తాను పోటీ చేసే స్థానంపై కూడా సంకేతాలు ఇవ్వవచ్చని సమాచారం.

‘తెలంగాణ ప్రజా జాగృతి’ అనే పేరుతో పార్టీని నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాని కి సూచించింది. ఇదిలా ఉండగా, పార్టీని ప్ర జల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగ సభ నిర్వహణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నా యి. ఇందుకోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ చివరి వారం లో లేదా మే ప్రారంభంలో ఈ సభ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.