3 June, 2026 | 6:36 PM

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు

26-03-2026 10:17 AM

న్యూడిల్లీ: న్యూడిల్లీ పార్లమెంట్ భవనంలో కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు జేపీ నడ్డాని, కేంద్ర విమాన శాఖామాత్యులు  కింజరాపు రామ్మోహన్నాయుడు సహాయంతో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ జేఏసీ అధ్యక్షులు టి. జనార్దన్ ఆధ్వర్యంలో జాతీయ  పీఎంపీ, ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం మర్యాదపూర్వకంగా  కలిసి జాతీయ స్థాయిలో  పీఎంపీ, ఆర్ఎంపీల సమస్యల గురించి వివరించి, జాతీయ స్థాయిలో గుర్తింపు గురించి వివరించడమైనది.

ఈ కార్యక్రమంలో జాతీయ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ కేజీ గోవింద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కన్వీనర్ వీబీటీ రాజు,ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు,ఏపీ జేఏసీ కన్వీనర్ జీఎస్  ప్రసాద్,ఎమ్ సుధాకర్, జాతీయ జేఏసీ నాయకులు తెలంగాణ నుండి పుల్గం మోహన్, గుజరాత్ నుండి సీఎస్ రావు,షకారియా నవీన్ చంద్ర,ఉత్తర ప్రదేశ్ నుండి ఓపీ మిశ్రా,యోగేష్ జోస్వాల్,బీహార్ నుండి అన్షూ తివారీ, పంజాబ్ నుండి ధన్మాల్ గోయల్,గుస్మైల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.