20 June, 2026 | 2:35 AM

ఆర్‌యూబీ పనులు ప్రారంభం

20-06-2026 12:22 AM

కేసముద్రం, జూన్ 19 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న అండర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభించారు. 5.25 కోట్ల వ్యయంతో సుమారు 7.6 అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పుతో అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఆర్ యూ బీ నిర్మించనున్నట్లు కాంట్రాక్టర్ ఎల్.నరసింహారెడ్డి, జిల్లా బీజేపీ నాయకుడు ఓలం శ్రీనివాసరావు తెలిపారు.

చాలా ఏళ్లుగా రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల అండర్ డ్రైనేజీ ద్వారా ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో డ్రైనేజీలో వరద నీరు ప్రవహిస్తుందడం వల్ల రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీనితో రైల్వే ట్రాక్ దాటడం కష్టంగా మారింది. ఆర్ యూ బీ నిర్మాణం వల్ల పట్టణ ప్రజలకు రైల్వే ట్రాక్ దాటడం తేలిక అవుతుంది.