దళితుల పక్షాన నిలిచిన కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ బురద జల్లుతోంది
జమ్మికుంట మున్సిపల్ చెర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
హుజురాబాద్,మార్చి29(విజయక్రాంతి) దళితుల కోసం నిరంతరం పోరాటం చేసిన నాయకుడు, దళిత పక్షపాతి అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర ఆరోపణలు చేస్తుందని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆరోపించారు. ఆదివారం జమ్మికుంటలో విలేకరుల సమావేశంలో అయన మాట్లాడాతు .
దళితుల హక్కుల కోసం ఎప్పుడూ ముందుండే కౌశిక్ రెడ్డిని రాజకీయంగా బలహీనపరచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం డివెర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. ఆదివారం అసెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్ అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా, అసలు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడం జరిగిందన్నారు .
కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి పై అనని మాటలు అన్నారని తప్పుడు ప్రచారం చేయడం పూర్తిగా రాజకీయ కుట్రేనని అన్నారు. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా పని చేసే నాయకుడిని తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక వైఖరిని బయటపెడుతోందన్నారు.అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనని మాటలు అన్నారని ఆరోపణలు చేస్తూ నిరాధార ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ వీడియోలను ప్రజల ముందుకు తీసుకురావాలి.
నిజం బయటపడితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డివెర్షన్ రాజకీయాలు ప్రజలకు స్పష్టమవుతాయి. దళితులను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగించే నాయకుడు కౌశిక్ రెడ్డి గారికి ప్రజల పూర్తి మద్దతు కొనసాగుతుందన్నారు.




