calender_icon.png 4 July, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాబాలలో నిబంధనలు పాటించాలి

04-07-2025 12:41:11 AM

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :  డీఎస్పీ నరేందర్‌గౌడ్ 

తూప్రాన్, జులై 3 : తూప్రాన్ పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారిపై ఉన్న దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లు చోరులకు అడ్డాలుగా మారుతున్నాయని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ తెలిపారు. గురువారం స్థానిక లింగారెడ్డి గార్డెన్స్లో డీఎస్పీ  ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చట్టానికి అనుకూలంగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని, నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

రాత్రుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు కల్తీలేని మంచి భోజనం అందించాలని, దాబాలలో మందు విక్రయాలు చేయరాదని హెచ్చ రించారు. దాబాల నిర్వహణ రాత్రి 11 వరకు నిర్వహించాలని, దాబాల వద్ద గాంజా అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు.

దాబా యజమానులు  జాగ్రత్తగా వ్యవహరించాలని, నిభందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సిఐ, నర్సాపూర్ సిఐ, రామయంపేట్ సిఐ, తూప్రాన్ ఎస్‌ఐ, డివిజన్ పరిధి ఎస్‌ఐలుఉన్నారు.