4 May, 2026 | 5:41 PM

ఉన్నత విద్య బలోపేతమే మా లక్ష్యం

04-07-2025 12:41 AM

- తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి 

మహబూబ్‌నగర్, జూలై 3 (విజయక్రాంతి) : ఉన్నత విద్య బలోపేతమే లక్ష్యంగా ఉన్నత విద్యా మండలి ముందుకు సాగుతుందని  తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. గురువారం పాలమూరు యూనివర్సిటీ ను విద్య మండలి కమిషన్ సభ్యులు సందర్శించారు.

ఈ  సందర్భంగా చైర్మన్ ఆకునూరి మురళి  మాట్లాడుతూ విద్యావ్యవస్థలోని సమస్యలను విద్యార్థుల నుంచి వివిధ సంఘాల నాయకుల నుంచి ప్రజాభిప్రాయాలను సేకరించి ఒక సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని, కేజీ టు పీజీ విద్యలో గల సమూల మార్పులకై అధ్యయనం చేస్తున్నామని, యూనివర్సిటీ స్థాయిలో గల వివిధ సమస్యల పైన ప్రత్యక్షంగా విద్యార్థుల నుంచి, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని, విద్యా రంగంలో వెనుకబడిన గట్టు మండలం ని ఆధారంగా చేసుకుని పాలమూరు యూనివర్సిటీని సందర్శించామని, త్వరలో మరిన్ని యూనివర్సిటీలను సందర్శించి నివేదిక తయారు చేస్తామన్నారు.

అనంతరం ఉపకులపతి ఆచార్య జి ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ  సిలబస్ రూపకల్పన  మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉందా లేదా అని, చాలామంది విద్యార్థులు మంచి పర్సంటేజ్ తో పాస్ అయినప్పటికీ జీవితంలో స్థిరపడడం లేదని, సమాజ అవసరాల కొరకు సిలబస్ రూపకల్పన జరగాలని, విద్యా కమిషన్ సభ్యులు యూనివర్సిటీలో సమస్యలను చర్చించి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసి పరిస్కారం లో సహకరించాలని అన్నారు.  అధ్యాపకులు అధ్యాపకేతరులు, విద్యార్థులు వివిధ సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

కాలేజీలో హాస్టల్లో క్లాస్ రూమ్ లో కొరత ఉందని, భోజన నాణ్యతను మరింత పెంచాలని, పరిశోధన అవసరాలకు అనుగుణంగా నిధులను పెంచాలని పలువురు అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు ,ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశ్వరయ్య , చారకొండ వెంకటేష్, జ్యోత్స్న, శివారెడ్డి, పరీక్షలు నియంత్రణ అధికారి డాక్టర్ కే ప్రవీణ, ప్రిన్సిపల్స్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి , రవికాంత్, కరుణాకర్ రెడ్డి, చావ వెంకట రెడ్డి, ఎస్, డాక్టర్ భగవంతు రెడ్డి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థులుపాల్గొన్నారు.