calender_icon.png 4 July, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనపర్తి మున్సిపాలిటీని ఆదర్శంగా మారుద్దాం

04-07-2025 12:39:31 AM

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, జూలై 3 (విజయక్రాంతి): వనపర్తి అభివృద్ధి కి కంకణ బద్దులమై పనిచేస్తున్నామని నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే మేఘారెడ్డి,ఆర్డీవో తాశీల్దార్‌మున్సిపల్ కమిషనర్ తో కలిసి వనపర్తి జిల్లా కేంద్రంలోని వివేకానంద కూడలి నుండి రామాలయం వరకు మార్నింగ్ వాక్ చేపట్టారు. వ్యాపార, వాణిజ్య, స ముదాయ యజమానులను ఎమ్మెల్యే అడిగి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కి అవసరమైన రూ.234 కోట్ల ప్రణాళికల నివేదికలను సీఎం దృష్టి కి తీసుకెళ్లామన్నారు. మూడు సంవత్సరాల వ్యవదిలో ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ వనపర్తి మున్సిపాలిటీ ని ఆదర్శ మున్సిపాలిటీ గా మారుస్తామన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు,వ్యాపారం,వాణిజ్య సముదాయాల యజమానులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

మూడు నెలలో రూ.50 కోట్లతో 20 సీసీ రోడ్డు పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించామన్నారు.హిందూ స్మశానా వాటిక, రోడ్లు, మంచినీటి సరఫరా,డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మున్విపల్ ఆధి కారులను ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం,తాశీల్దార్ రమేష్ రెడ్డి,మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు,మున్విపాలిటీ సిబ్బంది,అర్.అండ్ బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.