కమిషనర్ వర్సెస్ కౌన్సిలర్స్..!
అచ్చంపేట మున్సిపాలిటీలో ముదురుతున్న పంచాయతీ
కమిషనర్ ఒంటెద్దు పోకడపై అధికార పార్టీ కౌన్సిలర్ల ఆగ్రహం
అచ్చంపేట, ఏప్రిల్ 12: అచ్చంపేట ము న్సిపాలిటీలో కమిషనర్, కౌన్సిలర్ల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని అధికార పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వారు సామాజిక మాధ్యమం వాట్సాప్ వేదికగా ప్రస్తావించా రు. చికెన్ వ్యర్థాల సేకరణ నిర్వహణకు సం బంధించి టెండర్ ఇప్పటివరకు నిర్వహించలేదని కౌన్సిలర్లు ఆరోపించారు.
గత కాం ట్రాక్టర్ కాలపరిమితి గత నెల మార్చి నెలాఖరులో ముగిసినా, కొత్త టెండర్ ప్రక్రియ చేపట్టకపోవడంతో పాత వ్యక్తి అనుమతి లేకుండానే కొనసాగుతున్నాడని ఆరోపిస్తున్నారు. బీసీల ఆరాధ్య దైవం జ్యోతిబాపూలే జయంతిని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించినప్పటికీ అచ్చంపేట మున్సిపాలిటీలో నిర్వహించకపోవడం పట్ల కూడా కౌ న్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల పట్ల కనీస మర్యాద చూపడంలేదని వారు విమర్శించారు.
ఇటీవల నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కూడా కమిషనర్ పనితీరుపై కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చే శారు. తనకు అనుకూలంగా ఉన్న కొంతమందితో మాత్రమే సఖ్యతగా ఉంటూ మిగ తా సభ్యులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంకా మిగిలింది స్వల్పకాలమే..!
ప్రస్తుత అచ్చంపేట మున్సిపల్ పాలకవర్గం గడువు మే 7తో ముగియనుంది. అచ్చంపేట మున్సిపాలిటీ 20 వార్డులతో విస్తరించి ఉంది. మొత్తం సభ్యుల్లో నలుగు రు మినహా మిగతావారంతా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే. ఐదేళ్ల కాలంలో పలువురు కమిషనర్లు మారినా ఇప్పటివరకు పనితీరు సవ్యంగానే సాగింది. అయితే ప్రస్తుత కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సభ్యులతో విభేదాలు పెరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎందుకు ఈ రగడ..?
పాలకవర్గం గడువు ముగియనున్న సమయంలో కమిషనర్, కౌన్సిలర్ల మధ్య విభేదాలు పెరగడం ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కమిషనర్ కార్యాలయంలోని కొంతమంది సిబ్బందితో కూడా సఖ్యతగా లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువ అధికారులు ఎక్కువగా ఉండడంతో ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ అంతర్గత విభేదాలు పాలకవ ర్గం సభ్యులకు ఆసరాగా మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా పరిస్థితి మరింత ముదరకముందే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మున్సిపల్ కార్యాలయ పనితీరును చక్కదిద్దాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.




