జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
13-04-2026 12:09 AM
చౌటుప్పల్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్- జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో నగరవాసులంతా తమ సొంత ఊర్లకు వెళ్లారు. తిరిగి ఆదివారం సాయం త్రం హైదరాబాద్‌కు భారీగా వాహనాలు వస్తుండడంతో రోడ్డు విస్తరణ పనులు వాహనాల ప్రయాణానికి కొంత అడ్డంకిగా మారాయి. దీంతో మూడు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం వస్తే చాలు హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి రద్దీగా మారి భారీ ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేశారు.




