26 March, 2026 | 2:05 AM

పెట్రోల్, డీజిల్ కొరతపై పుకార్లు

26-03-2026 12:51 AM
  1. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంక్‌ల వద్ద బారులుదిరిన వాహనదారులు
  2. ఇంధన నిల్వలు ఉన్నాయి.. ప్రజలు పుకార్లు నమ్మొద్దు..
  3. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ల హెచ్చరిక 

ఆదిలాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఆదిలాబా ఉమ్మడి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొందనే పుకార్లు షికార్లు చేయడంతో పెట్రోల్ బంక్‌లు వాహన దారులతో కిటకిట లాడుతున్నాయి. ఓవైపు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఎలాంటి కొరత లేదంటూ జిల్లా అధికా రులు, పెట్రోల్ బంక్‌ల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నప్పటికీ ప్రజలు  మాత్రం భయాం దోళన చెందుతున్నారు.

మరి ఎలాంటి కొరత లేనప్పుడు గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, పెట్రోల్ బంక్ ల నిర్వాకులు ‘నోస్టాక్’ బోర్డ్ ఎందుకు పెడుతు న్నారంటూ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తు న్నారు. ఏది ఏమైనా అధికారుల ప్రకటనలు, ప్రజల్లో నెలకొన్న అపోహలతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, వాహనదారులు గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్‌ల కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో, పెట్రోల్ బంక్‌ల వద్ద ఎక్కడ చూసిన వాహనదారులు తన వాహనాలతో బారులు దీరిన దృశ్యాలే దర్శనమిస్తున్నాయి.

గత రాత్రి నెలకొన్న పుకార్ల కారణంగా ఆదిలా బాద్ పట్టణంలోని పలు పెట్రోల్ బంక్‌లో అర్ధరాత్రి దాటే వరకు వాహనదారులు పెట్రో ల్ కోసం బారులుతీరారు. పెట్రోల్ దొరుకు తుందో లేదోననీ భయంతో పలువురు వాహనదారులు తమ వాహనాలు ఫుల్‌ట్యాం క్ చేసుకుంటున్నారు. మరికొందరైతే వాటర్ క్యాన్‌లు, ప్లాస్టిక్ డబ్బాలతో పెట్రోల్ బంక్ లకు పరుగులు తీస్తున్నారు. 

ఇదిలాఉంటే జిల్లాలో పెట్రోల్ కొరత నెల కొందనే పుకార్ల ప్రజలు నమ్మొద్దని డీఎస్‌ఓ నందిని సూచించారు. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారుల తీరడంతో బుధవారం ఆయా బంక్ లను ఆమె సందర్శించి అక్కడి పరిస్థితిపై ఆడా తీశారు. ఇంధన నిల్వలున్నాయని తెలి యజేస్తూ ప్రజలు ఆందోళనకు గురికావొద్ద సూచించారు. పుకార్ల కారణంగా వాహనదా రులు అధిక మొత్తంలో వెట్రోల్, డిజి వేయిం చుకోవడంతో ఆయా బంక్ ల్లో కొరత ఏర్పాడి నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చిందన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 బంకుల్లో ఎలాంటి కొరత లేకుండా, ఇంధనం అందుబాటులో ఉంచేలా కలెక్టర్ ఇప్పటికే ఆయా కంవెనీల ప్రతినిధులతో మాట్లాడడం జరిగిందని వివ రించారు. ప్రజలు భయందోళనకు గురి అయి బంకుల వద్ద బారుతీరొద్దని, అవసరం మేరకే పెట్రోల్, డిజిల్‌ను పోయించుకోవాలని సూచించారు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకోని కృత్రిమ కొరత సృష్టించిన.. బ్లాక్‌లో విక్రయిం చిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నిర్మల్‌లోనూ.. నోస్టాక్ బోర్డులు 

నిర్మల్: నిర్మల్ జిల్లాలో పలు పెట్రోల్ బంకుల్లో బుధవారం పెట్రోల్ నోస్టాక్ బోర్డు లు కనిపించాయి. పెట్రోల్ డీజిల్ కోరుతా లేదని అధికారులు ప్రకటిస్తున్న పట్టణంలోని 12 బంకుల్లో పెట్రోల్ లేకపోవడంతో వాహన దారులు ముప్పు తిప్పలు పడ్డారు. ఏ బంకు వెళ్లిన స్టాకు లేదని చెప్పడంతో నిరాశతో వేణుతిరిగారు. దిల్వార్పూర్, కుంటాల, బైంసా , బాసర, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా పెట్రోల్ దొరకడం లేదని వాహన దారులు పేర్కొంటున్నారు.