13 May, 2026 | 9:59 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

పుతిన్‌కు అనారోగ్యమంటూ పుకార్లు

19-10-2024 01:51 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: రష్యా అధ్యక్షుడు పుతిన్ అనారోగ్యంతో ఉన్నారన్న వార్తలు  వ్యాపిస్తున్నాయి. తాజాగా అక్కడి మీడియాల్లో పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై కథనాలు వెలువడ్డాయి. కాగా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఈ వార్తలను ఖండించింది. తాజాగా అధ్యక్షుడు పుతిన్, ఆరోగ్య మంత్రి మిఖాయిల్ ముర్కాష్కాతో కలిసి ఫ్లూ వ్యాక్సినేషన్‌లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘నేను సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్‌లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నా. దేశీయంగా ఉత్పత్తి చేసిన మందులతో టీకాలు వేయమని సిఫార్సు చేస్తున్నా’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వ్యాపిస్తున్నాయి.