3 July, 2026 | 9:27 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

రూపాయి నిలువునా పతనం

28-12-2024 12:50 AM
  • ఇంట్రాడేలో 85.80 స్థాయికి పడిపోయిన విలువ
  • రెండేండ్లుగా ఎన్నడూ చూడని క్షీణత

ముంబై, డిసెంబర్ 27: రూపాయి విలు వ అదేపనిగా పడిపోతున్నది. డాలర్ బలోపేతంకావడం, దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులు తరలిస్తున్న నేపథ్యంలో రూపాయి విలువ మరింత దిగజా రింది.

శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో (ఫారెక్స్) డాలరు మారకంలో రూపాయి విలువ  ఇంట్రాడే ట్రేడింగ్‌లో 53 పైసలు పడిపోయి 85.80 వద్ద  ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయిని తాకింది. ఒకే రోజున ఇంతభారీగా కరెన్సీ తగ్గడం గత రెండేండ్లలో ఇదే ప్రధమం. 2023 ఫిబ్రవరి 2న ఇంట్రాడేలో 68 పైసలు కోల్పోయింది. అయితే ఈ శుక్రవారం ట్రేడింగ్ ముగింపు సమయంలో కొంత కోలుకుని, చివరకు  21 పైసలు నష్టంతో 85.48 వద్ద నిలిచింది. 

డాలర్లకు భారీ డిమాండ్

ఈ డిసెంబర్ నెలలో ఇప్పటివరకూ  రూపాయి 80 పైసలు పైగా నష్టపోయింది. బ్యాంక్‌లు, దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం రూపాయిని దెబ్బతీసిం ది.

ఆర్బీఐ డిసెంబర్, జనవరిలో మెచ్యూర్ అయ్యే 21 బిలియన్ డాలర్ల విలువైన షార్ట్‌సైడ్ ఫార్వర్డ్ కాంట్రాక్టుల్ని హోల్డ్‌చేస్తున్నదని, వాటిని రోలోవర్ చేయకపోవడంతో మార్కె ట్లో డాలర్ల కొరత ఏర్పడి, రూపాయిల సరఫరా అధికమైపోయిందని, ఫలితం గా దేశీ కరెన్సీ భారీగా పతనమయ్యిందని ఫారెక్స్ ట్రేడర్లు వివరించారు. 

ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరగడమూ రూపాయిని కుదేలును చేసిందన్నారు.  అమెరికా అధ్యక్ష పద వి చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ పలు దేశా ల ఉత్పత్తులపై టారీఫ్‌లు పెంచుతారన్న భయాలతో దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరుగుతున్నదని వారు చెప్పారు.

డాలర్ ఇండెక్స్ రెండేండ్ల గరిష్ఠస్థాయి 108 సమీపంలో ట్రేడవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 74 డాలర్ల వద్దకు పెరిగింది. రానున్న రోజుల్లో డాలరు/రూపాయి పెయిర్ 85.30 రేంజ్ లో ట్రేడవుతుందని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అంచనా వేశారు.