27 June, 2026 | 1:14 AM

రూపీ రికవరీ

06-06-2024 01:36 AM

స్వల్పంగా పెరిగిన కరెన్సీ

ముంబై, జూన్ 5: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేపథ్యంతో స్టాక్ మార్కెట్ పతనాన్ని ప్రతిబింబిస్తూ మంగళవారం భారీగా పడిపోయిన రూపాయి బుధవారం స్వల్పంగా కోలుకున్నది. బుధవారం  ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 7 పైసలు పెరిగి 83.44 వద్ద ముగిసింది. క్రితం రోజు ఇది 40 పైసల మేర పతనమైన సంగతి తెలిసిందే. దేశీయ ఈక్విటీ మార్కెట్ పెరగడం, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గడంతో రూపాయి విలువ పుంజుకున్నదని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవడం కూడా రూపాయి బలపడటా నికి కారణమని బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. ప్రపంచ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.23 శాతం పెరిగి 104.29 స్థాయికి చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 77.57 డాలర్ల సమీపంలో ట్రేడవుతున్నది.