27 June, 2026 | 2:35 AM

లోటు నుంచి మిగులులోకి

06-06-2024 01:34 AM

భారత్ కరెంట్ ఖాతాపై ఇండియా రేటింగ్స్

న్యూఢిల్లీ, జూన్ 5: యూఎస్, ఇతర వర్థమాన మార్కెట్లలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గడం, ఆర్థికాభివృద్ధి పుంజుకోవడంతో భారత్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ (సీఏబీ) 2023 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో 6 బిలియన్ డాల ర్ల మిగులును (జీడీపీలో 0.6 శాతం) సాధించగలుగుతుందని ఇండియా రేటిం గ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్‌రా) అంచనా వేసింది. 2021 ఆర్థిక సంవత్సరం క్యూ1 తర్వాత కరెంట్ ఖాతాలో తొలిసారిగా మిగులు సాధించనున్నట్టు తెలిపింది. 2023 డిసెంబర్ త్రైమాసికంలో 10.5 బిలియన్ డాలర్ల (జీడీపీలో 1.2%) లోటును కనపర్చిన కరెంట్ ఖాతా తాజా గా ముగిసిన త్రైమాసికంలో మిగులు సాధించడం గొప్ప టర్న్‌ఎరౌండ్‌గా రేటిం గ్ ఏజెన్సీ అభివర్ణించింది. క్యూ4 కరెంట్ ఖాతాకు పాజిటివ్ అయినప్పటికీ, 2023  పూర్తి ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 0.6 శాతం లోటే ఉంటుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.