పల్లెల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాథ్యం
ఎమ్మెల్సీ దండే విఠల్
కాగజ్‌నగర్, మార్చి 22 (విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలం కోయవాగు సర్పంచ్ చింతపురి లక్ష్మీ , మాజీ ఉప సర్పంచులు అదే రాజు మాజీ కో ఆప్షన్ సభ్యులు చొటుభాయ్, వార్డు సభ్యులు ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కలగాలన్న గ్రామ అభివృద్ధి చెందాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని అన్నారు.
త్వరలోనే సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధిపరిచే బాధ్యత తనదఅన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగురే శ్యామ్ రావు,నాయకులు జావిద్,రాజు ,తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.




