రైతుభరోసా విడుదల
- రెండో విడత రైతుల ఖాతాలో 5.653 కోట్లు జమ
- రైతుల కళ్లలో ఆనందమే కాంగ్రెస్ ధ్యేయం
- ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి
మంథని, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లిలో సోమవారం నిర్వహించిన రైతుభ రోసా సభలో రెండో విడత భరోసా నిధులు 5.653 కోట్లను విడుదల చేశారు. రైతుల ఖా తాల్లో నిధులను జమ చేయడంతో రైతుల కళ్లలో ఆనందం వెళ్లి విరిసింది. రైతుల కళ్ల లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ ధ్యే యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండ లం నస్తూరిపల్లిలో నిర్వహించిన రెండో విడ త రైతుభరోసా సభలో రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితర మంత్రులు పాల్గొన్నారు. రైతుల అకౌంట్లోకి రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, కొనుగోలు చేసిన వెంటనే రైతుల అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నామని, రైతులను రాజులాగా మార్చేందుకే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు రైతు భరోసా నిధులు విడుతలవారీగా అందిస్తున్నామని అన్నారు.
గత ప్రభుత్వంలో తెలంగాణ దివాలా తీసిందని, వారు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు మాత్రం రైతు భరోసా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఎప్పటికప్పుడు సమావేశం ఏర్పాటు చేసి రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు.






