22 August, 2026 | 3:51 PM

Breaking News

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి   •   మైనారిటీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్   •   జవాబుదారితనంతో విధులు నిర్వహించాలి   •   సెయింట్ జాన్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్ రూపా రెడ్డికి శ్రద్ధాంజలి   •   కార్మిక హక్కుల పరిరక్షణ, ఉద్యమాలకు సిద్ధం కావాలి   •   చెట్టు కిందే తరగతులు.. కళాశాలలో వసతిగృహం నిర్వహణ   •   పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి   •   ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

ఎంజీయూ భోజనంలో పురుగు

21-04-2026 01:43 AM
  1. వీసీ స్పందించడం లేదంటూ విద్యార్థుల ఆగ్రహం
  2. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన

నల్లగొండ, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో పురుగు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వైస్ ఛాన్స్ లర్  స్పందించకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశా రు. ఈ సంఘటనపై ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు విశ్వవిద్యాలయం ప్రాంగణం లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా సంఘం విశ్వవిద్యాలయ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత లేకుండా ఉండటం, అందులో పురుగులు కనిపించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.విద్యార్థుల సమస్యలను పరిష్కరిం చాల్సిన బాధ్యత ఉన్న వైస్ చాన్సలర్ స్వయంగా వచ్చి పరిస్థితిని సమీక్షించాల్సింది పోయి, నిర్లక్ష్యంగా స్పందించడం దురదృష్టకరమన్నారు.

విశ్వవి ద్యాలయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.విద్యార్థుల ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, అవసరమైతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అజయ్, సంపత్, సతీష్, విజయ్, వెంకటేష్, సుధీర్, అరవింద్, పృథ్వి, సాయి,గోపి,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.