25 May, 2026 | 1:46 AM

శిథిలావస్థలో రైతు వేదిక

25-05-2026 12:18 AM

నిర్వహణ లేక ఎండిపోతున్న పల్లె ప్రకృతి మొక్కలు

వాంకిడి, మే 24 (విజయక్రాంతి): రైతును రాజు చేయాలన్న సంకల్పంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొన్ని గ్రామాలను కలిపి క్లస్టర్ గా ఏర్పాటు చేసి రైతు వేదికలను నిర్మించింది. వాంకిడి మండలంలోని సోనాపూర్, బెండర గ్రామ పంచాయతీ పరిధిలలో నిర్మించిన రైతు వేదిక నిర్వహణ లేక దుమ్ము దూళికి నిలయంగా మారి శిథిలావస్థకు చేరుతోంది. వ్యవసాయ శాఖ, గ్రామపంచాయతీ మధ్య ఎవరు చూసుకోవాలని స్పష్టత లేకపోవడంతో నిర్లక్ష్యానికి గురవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతు వేదిక చుట్ట పిచ్చి మొక్కలు మొలిశాయి. విద్యుత్ కనెక్షన్ ఉన్న బల్బులు వెలగకపోవడంతో రాత్రి సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టీ ఉపయోగం లేకుండా వదిలేయడంతో ప్రభుత్వ ధనం వృథాగా మారింది. గ్రామపంచాయతీ పరిధిలోని గణేష్ పూర్ జాతీయ రహదారి పక్కనే గత ప్రభుత్వం హాయంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిర్వహణ లేక మొక్కలు ఎండి పోయాయి. పల్లె ప్రకృతి వనం నిర్వహణ నిధులు లేకపోవడంతో పాటు సిబ్బంది కొరత కారణంగా ఏం చేయలేక పోతున్నట్లు గ్రామ పంచాయతీ పాలకవర్గం చెబుతున్నారు.