క్వార్టర్స్‌కు సచిన్
వరల్డ్ బాక్సింగ్ క్వాలిపయర్స్
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్ అర్హత టోర్నీ వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫయర్స్‌లో భారత బాక్సర్లు మరోసారి సత్తా చాటారు. పురుషుల విభాగంలో సచిన్ సివాచ్, సంజీత్ కుమార్‌లు క్వార్టర్స్‌కు చేరి.. పారిస్ బెర్త్ దక్కించుకునేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచారు. గురువారం 57 కేజీల ప్రిక్వార్టర్స్‌లో సచిన్ 5 బతుహన్ (టర్కీని) చిత్తు చేసి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 92 కేజీల విభాగంలో సంజీత్ వెనిజులా బాక్సర్ లూయిస్ సాంచెజ్‌పై కష్టపడి నెగ్గాడు. 57 కేజీల విభాగంలో పారిస్ టికెట్ దక్కించుకునేందుకు ముగ్గురికి మాత్రమే అవకాశం ఉండడంతో సచిన్ మరో రెండు బౌట్లలో విజయం సాధించాల్సిన అవసరముంది. ఇప్పటికే నిషాంత్ (71 కేజీలు) , అంకుషితా బోరో (60 కేజీలు) క్వార్టర్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.






