2 July, 2026 | 2:57 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

అదే అసలైన సవాల్

31-05-2024 12:24 AM

న్యూయార్క్: తన దృష్టిలో సారథ్యం అసలైన సవాల్ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా ఆటగాళ్లను సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదని.. వారి ఆలోచన విధానం విభిన్నంగా ఉంటుందని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న రోహిత్ కెప్టెన్సీపై స్పందించాడు. ‘సారథిగా నేను చాలా వరకు డేటాపై ఆధారపడతాను. దానిని విశ్లేషించే వ్యూహాలు సిద్ధం చేసుకుంటాను. ఇందుకోసం గంటల కొద్దీ సమయం మీటింగ్ రూముల్లో గడుపుతా. మైదానంలోకి దిగే సమయానికి అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవడానికి పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటా. మ్యాచ్‌లో ఆటగాళ్లను సమన్వయం చేసుకోవడం కెప్టెన్‌కు సవాల్ లాంటిది. ఇక్కడ ఆటగాళ్ల ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. అవసరాన్ని బట్టి స్పందిస్తూ అందరికి సమప్రాధాన్యం ఇవ్వాలి.  విభిన్న శైలి కలిగిన ఆటగాళ్లను అర్థం చేసుకొని సూచనలు ఇచ్చేందుకు కెప్టెన్ రెడీగా ఉండాల్సిందే’ అని రోహిత్ పేర్కొన్నాడు.