ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు
రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన బస్తాలు
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి గ్రామంలో పాటు మండలంలో మరికొన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన వరి ధాన్యం బస్తాలు రోజుల తరబడి పండుతెండలో ధాన్యం బస్తాల్లో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాసంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు ఐకెపి చేస్తుంది.కాంటచేసి నాలుగు రోజులు నుండి ఎండిపోతున్నాయని ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు ఒక లారీ కూడా రావడం లేదని, తూకం చేసిన వరి ధాన్యం సంచులుపై టాపర్లు కప్పి మండుటెండలో మాడిపోతున్నాయి.
ఇట్టి విషయమై ఐకెపి అధికారులకు లారీలు రావడంలేదని రైతులు ఎంత మొత్తుకున్నా.. వస్తాయి అంటూ నాలుగు రోజుల నుండి కాలయాపన చేస్తూ అశ్రద్ధ వహిస్తున్నారని, మండుటెండలో గ్రామస్తులు రైతులు ఎండకు తట్టుకోలేక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మండలంలో కొన్ని గ్రామాల్లో మండల అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ ఆదర్యపడవద్దు ధైర్యంగా ఉండాలని పూర్తిస్థాయిలో చివరి వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని భరోసా,ధైర్యం నింపుతున్నారు.
కానీ మాసంపల్లి గ్రామంలో తూకం చేసిన వరి ధాన్యం,ధాన్యాన్ని పండించిన రైతులు మండుటెండలో మండుతూ లారీల కోసం ఎదురుచూస్తూ నిరీక్షిస్తున్నారు. అధికార సిబ్బంది స్పందించి కరుణించి మాసానిపల్లి వైపు మొగ్గుచూపి ధాన్యాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి సంవత్సరం అధికారులు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తూ ఇబ్బందులకు గురి చేస్తారని మాసానిపల్లి అంటే అంత చులకనా అని రైతులు గ్రామస్తులు అంటున్నారు.






