18 August, 2026 | 1:20 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

మృతురాలి పాపని చూసి కన్నీటి పర్యంతమైన సీతక్క

05-05-2026 08:02 PM

హనుమకొండ రూరల్,(విజయక్రాంతి): రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఘనపురం వాస్తవ్యులు బండారి రాజయ్య  కుమార్తె, చక్రవర్తి హాస్పిటల్స్ సీఈవో సూర్య ప్రకాష్ సోదరి ఇటీవల మృతి చెందగా మంగళవారం తిరుమలగిరి గ్రామంలోని వారి నివాసానికి  పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు  ధనసరి అనసూయ సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, చక్రవర్తి హాస్పిటల్ డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి తో కలిసి విచ్చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిన్న పాపను చూసి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భావోద్వేగానికి గురై బాధపడ్డారు.అనంతరం  మృతురాలికి నివాళులు అర్పించి, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ములుగు,భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, వైద్యులు, చక్రవర్తి హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.