గౌడ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలి
సైదులు గౌడ్
నల్లగొండ టౌన్, జూన్ 14 : గౌడ పేద వి ద్యార్థులు ఎంతోమంది చదువులో ప్రతిభ క నబరిచినప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా రాణించలేకపోతున్నారని వారి అభ్యున్నతి కోసం పాటుపడాల్సిన అవసరం గౌడ క మ్యూనిటీ పై ఉందని గౌడ సంఘం నేత, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు తండు సైదులు గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గౌడ హాస్టల్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా గౌడ విద్యార్థులు నల్లగొండలోని పలు కళాశాలలో చదువుతూ ప్రైవేట్ హాస్టల్లో డబ్బులు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నందున గౌడ్ హాస్టల్లోనే సౌకర్యాలు కల్పించే విధంగా అందరం చేయూతని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నా రు.
జిల్లా వ్యాప్తంగా వెనుకబడ్డటువంటి గౌ డ కమ్యూనిటీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అభివృద్ధి చెందిన వారు వారికి సాయం చేసే విధంగా ముందుకు సాగాలని కోరారు. గౌడ్ హాస్టల్ సంబంధించిన పాత కమిటీ పీరియడ్ అయిపో యినందున నూతనంగా కమిటీ వేసుకొని ఆ కార్యవర్గం హాస్టల్ అభివృద్ధి పట్ల చర్యలు తీసుకోవాలని సూచించారు.
సుంకరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇప్పటివరకు పని చేసి నటువంటి పాత కమిటీ తోపాటు సొంతం గా సుంకరి వెంకటేశ్వర్లు 5.76 లక్షలు ఖర్చుచేసి హాస్టల్ ను అభివృద్ధి పరిచినందుకు ప్రత్యేకంగా అభివృద్ధి పరిచినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌడ సం ఘం నేతలు రాజయ్య గౌడ్ సోమగాని శం కర్ గౌడ్ సుంకరి వెంకటేశ్వర్లు గౌడ్ చెరుకు మల్లికార్జున్ గౌడ్, మారయ్య,సుంకరి మల్లే ష్, పాలకూరి యాదయ్య, నకిరేకంటి సైదు లు, కొప్పు కృష్ణయ్య,ఏర్కలి శంకర్,కొండ జానయ్య,పండు కృష్ణ కౌండిన్య తదితరులు పాల్గొన్నారు.






