calender_icon.png 15 October, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రులను కోల్పోయిన సాద్దీన్ కుమార్

15-10-2025 06:42:50 PM

చొప్పదండి (విజయక్రాంతి): ఐదవ తరగతి చదువుతున్న సాద్దీన్ విద్యార్థి తల్లి తండ్రి మరణించడంతో అనాధగా మారాడు. చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన దీకొండ సాద్దీన్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. తన తండ్రి దీకొండ అశోక్ ఆదివారం రోజున గుండె నొప్పితో(హార్ట్ ఎటాక్) మరణించడంతో అనాధగా మారాడు. గత మూడు సంవత్సరాల క్రితం తన తల్లి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో మరణించింది.

మూడు సంవత్సరాల నుండి అన్ని తానై పెంచిన కొడుకుపై కొండంత ఆశలు పెట్టుకొని కంటికి రెప్పలా పెంచుకున్న తండ్రి మరణించడంతో అనాధగా మారాడు. అంతకుముందే గత 5 సంవత్సరాలకు ముందు తాత మరణించాడు, ఒక సంవత్సరం క్రితం నానమ్మ మూత్ర పిండాల వ్యాధితో మరణించారు. నాకు దిక్కెవరు అంటూ పిల్లాడు ఏడుస్తుంటే అక్కడి స్థానికులు కంటతడి పెట్టిన తీరు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎవరైనా దాతలు కానీ, ప్రభుత్వం కానీ, స్వచ్చంద సేవ సంస్థలు కానీ ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.